India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న టీమిండియాకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టుకు బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లోనే కోలుకోలేని షాక్ తగిలింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఘోరమైన చేదు అనుభవం ఎదురైంది. పసికూన చేతిలో చిత్తుగా ఓడిపోయి, అయ్యర్ తన కెప్టెన్సీ పరువును బజారున పడేశారు. ఇప్పటివరకు ఐర్లాండ్ చేతిలో ఓటమి ఎరుగని భారత్, ఈ చెత్త ప్రదర్శనతో తలదించుకోవాల్సి వచ్చింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కొత్త కెప్టెన్ లీడర్ షిప్ ఇన్నింగ్స్ ఆడాడు. లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అన్నట్లుగా లార్కన్ టక్కర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనికి గారెత్ డెలానీ తోడవడంతో ఐర్లాండ్ 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Also Read
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఐర్లాండ్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. గాయపడిన చేత్తోనే బౌలింగ్ చేసిన మాథ్యూ హంఫ్రీస్ 3 వికెట్లతో భారత బ్యాటింగ్ వెన్నువిరిచాడు. డెబ్యూటెంట్లు జై మూంద్రా, మాట్ హాలండ్ చెరో రెండు వికెట్లతో (కలిసి 5/54) భారత్‌ను కోలుకోకుండా చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 50) మినహా ఎవరూ కనీస పోరాట పటిమ చూపించలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం 3 పరుగులకే చేతులెత్తేయగా, సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి, 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ అవమానకర ఓటమిపై సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. “సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన టీమ్ అంటే పాకిస్తాన్, సౌతాఫ్రికా లాంటి జట్లే వణికిపోతాయి.. అలాంటిది ఐర్లాండ్‌తో అలవోకగా ఓడిపోతారా?” అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సిరీస్‌కు ఎంపికైన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోకపోవడం అయ్యర్ చేసిన బ్లండర్ మిస్టేక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కనీస గట్టి పోటీ కూడా ఇవ్వకుండా పరువు తీసుకున్న అయ్యర్ కెప్టెన్సీపై మీమ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ల పరువును ఐర్లాండ్ వీధుల్లో పారేసారంటూ నెటిజన్లు భీభత్సమైన ట్రోలింగ్స్‌తో విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!