Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ తీసుకోవడానికి శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ వెనుక పరిగెత్తాడు. క్యాచ్ తీసుకునే సమయంలో నేలపై పడిపోవడంతో కడుపులో తీవ్ర గాయం అయింది. గాయం కారణంగా శ్రేయస్ ప్లీహానికి గాయం, అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో శ్రేయాస్ సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చాలా రోజులు ICUలో చికిత్స పొందాడు.
READ MORE: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
అక్టోబర్ 25, 2025న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు ఎడమ పక్కటెముక దిగువ భాగంలో గాయమైంది. తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని గతంలో బీసీసీఐ గతంలో ప్రకటన విడుదల చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా శ్రేయాస్ అయ్యర్ కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను అందించింది. శ్రేయాస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, కానీ ప్రస్తుతానికి సిడ్నీలోనే ఉంటారని BCCI పేర్కొంది. శ్రేయాస్ చికిత్సలో కీలక పాత్ర పోషించిన వైద్యులకు BCCI కృతజ్ఞతలు తెలిపింది.
READ MORE: CM Chandrababu: మొంథా తుఫాన్ నష్టాన్ని టెక్నాలజీతో తగ్గించాం..
