NTV Telugu Site icon

Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..

Iyer

Iyer

ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో రేపు (శుక్రవారం) జరగాల్సిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అయ్యర్‌ చురుగ్గా కనిపించాడు. దీంతో అతను బంగ్లాదేశ్ తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనుట్లు తెలుస్తుంది. టీమిండియా ఇది వరకే ఫైనల్స్‌కు చేరిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పలువురు సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వాలని బీసీసీఐ చూస్తుంది.

Read Also: Sai Rajesh: బేబీ సినిమాకు డ్రగ్స్ నోటీసులు.. డైరెక్టర్ ఏమన్నాడంటే.. ?

కాగా, తుది జట్టులో అయ్యర్‌ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు.. అయితే, బంగ్లాదేశ్‌పై అయ్యర్‌ రాణిస్తేనే టీమిండియాకు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో టీమ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్‌ పాకిస్థాన్ పై సెంచరీతో రెచ్చిపోయాడు. అంతకుముందు గ్రూప్‌ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ రాణించడంతో నాలుగో నంబర్‌ స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. బంగ్లాపై అయ్యర్‌ కూడా రాణిస్తే ఫైనల్లో ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అనే విషయంపై సందిగ్థత నెలకొంది. దీంతో శ్రేయస్ ఎంట్రీ ఇప్పటి నుంచే టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది.

Read Also: Aircraft: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన ఎయిర్‌క్రాఫ్ట్‌

రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, ఇషాన్‌ ముగ్గురు రాణించడం టీమిండియాకు శుభపరిణామమే అయినప్పటికీ జట్టు ఎంపికలో ప్రధాన సమస్యగా మారే ఛాన్స్ ఉంది. మున్ముందు భారత మిడిలార్డర్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయానేది వేచి చూడాలి.. సూపర్‌-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్‌, శ్రీలంకలను ఓడించి.. ఫైనల్ కు చేరుకుంది. తుది పోరుకు ముందు భారత్‌ రేపు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. శ్రీలంక-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ జరిగే మ్యాచ్‌తో మరో ఫైనల్‌ బెర్త్‌ ఖరారు అవుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌ లో పాక్‌ గెలిస్తే, భారత్‌తో ఫైనల్లో తలపడుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా, పాయింట్ వచ్చినా.. శ్రీలంక ఫైనల్‌కు వెళ్తుంది.