NTV Telugu Site icon

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు

Sravan Rao

Sravan Rao

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8వ తేదీన మళ్లీ తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా శ్రవణ్ రావు తప్పించుకుంటున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని సిట్ కోరింది. రెండు సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగితే ఒకటే ఇచ్చి శ్రవణ్ రావు తప్పించుకున్నారు.

Also Read:Gaza-Israel: గాజాలో భారీగా ఐడీఎఫ్ దళాల మోహరింపు.. హమాస్ టార్గెట్‌గా ఆపరేషన్ షురూ

శ్రవణ్ రావు పాత తుప్పు పట్టిన సెల్ ఫోన్ ని పోలీసులకు ఇచ్చారు. శ్రవణ్ రావు ఇచ్చిన సెల్ ఫోన్ చూసి షాక్ కు గురైన పోలీసులు. ఈ నేపథ్యంలో మేము అడిగిన రెండు సెల్ ఫోన్లు తీసుకొని 8వ తేదీన హాజరు కావాలని శ్రవణ్ రావుకి నోటీసులు జారీ చేశారు. మొదటిసారి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ జరిగిన విచారణలో పాత తుప్పు పట్టిన సెల్‌ఫోన్ ఇచ్చి ఏమీ తెలియదని చెప్పారు. దీంతో తాము అడిగిన సెల్ ఫోన్లు సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా సిట్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని శ్రవణ్ రావుని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Also Read:Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీకి తరలింపు!

సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేకాతర్ చేస్తున్న శ్రవణ్ రావు. అప్పటి ప్రభుత్వ పెద్దలతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రవణ్ రావు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ప్రభాకర్ రావు తో మాత్రమే సంబంధం ఉందని చెప్తున్నాడు. రాజకీయ నాయకులు అప్పటి ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేసిన వాళ్లపై శ్రవణ్ రావు నిగాపెట్టాడు. జడ్జ్ లతోపాటు మీడియా అధిపతులను సైతం శ్రవణ్ రావు వదిలిపెట్టలేదు.