Site icon NTV Telugu

Shraddha Kapoor : పెళ్లి పై శ్రద్ధా కపూర్ క్లారిటీ.. మరి పెళ్లి కొడుకు అతడేనా?

Sradhakapoor

Sradhakapoor

కెరీర్ పరంగా ఎంత బీజిగా ఉన్న ఈ మధ్య హీరోయిన్‌లు.. వారి వ్యక్తిగత జీవితం పెళ్లి.. పిల్లల విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉంటున్నారు. వరుస చిత్రాలు చేతిలో ఉన్న గ్యాప్ ఇచ్చి మరి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా చేరింది. రీసెంట్‌గా ‘స్త్రీ’ వంటి భారీ విజయాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఆదిత్య రాయ్ కపూర్, రోహన్ శ్రేష్ట వంటి వారితో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా వినిపిస్తున్న పేరు..

Also Read : Mega158: చిరంజీవికి జోడీగా ఐశ్వర్య రాయ్..!

రాహుల్ మోడీ.. రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన రాహుల్ మోడీతో శ్రద్ధా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జంటగా పలు బాలీవుడ్ వేడుకల్లో కనిపిస్తుండటం, సోషల్ మీడియాలో వీరి ఫొటోలు వైరల్ కావడంతో పెళ్లి వార్తలకు బలం చేకూరింది. ఇటీవల ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పెళ్లి గురించి ప్రశ్నించగా, శ్రద్ధా ఎక్కడ తడబడకుండా ‘నేను కూడా కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కొడుకు పేరు అధికారికంగా చెప్పకపోయినా, ఆమె రాహుల్ మోడీ తో ఉన్న బంధాన్ని ఖండించకపోవడం విశేషం.

Exit mobile version