NTV Telugu Site icon

Gun Fire On School Van: స్కూల్ వ్యాన్‌పై బహిరంగంగా కాల్పులు

Gun Fire

Gun Fire

Gun Fire On School Van: ఉత్తరప్రదేశ్‌ లోని అమ్రోహాలో బైక్‌పై వెళ్తున్న దుండగులు స్కూల్ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారని, దీంతో పిల్లలు కేకలు వేయడం ప్రారంభించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ పాఠశాల బీజేపీ నేతకు చెందినదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Pakistan: బిన్ లాడెన్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణ శిబిరం.. కనిపెట్టిన భారత ఇంటెలిజెన్స్

ఈ ఘటన తర్వాత పోలీసు యంత్రాంగంలో కలకలం రేగడంతో పాటు పాఠశాల వెలుపల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంత బీజేపీ నాయకుడు చౌదరి వీరేంద్ర సింగ్ ఈ సంఘటనను ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులపై పోలీసుల నుండి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దింతో పోలీసులు విషయంపై విచారణ చెప్పట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: IND vs NZ 2nd Test: ఏడేసిన శాంట్నర్.. 156 పరుగులకే భారత్‌ ఆలౌట్‌!

Show comments