టాలీవుడ్ లో కొనసాగుతున్న షూటింగ్స్ బంద్ 9వ రోజుకు చేరుకుంది. కానీ పరిస్కారం దొరకలేదు. నిన్న తెలంగాణ ఎఫ్ డి సి ఛైర్మెన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో విడి విడి గా చర్చించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం అని ఫెడరేషన్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read : Tollywood : వార్ 2, కూలీ టికెట్స్ రేట్స్ పెంచి ప్రేక్షకులను దోచేస్తున్న నిర్మాతలు
ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ లో దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జారబోతున్నారు. ఈరోజు జరిగే చర్చలలో సానుకూల స్పందన వస్తుంది అని ఫెడరేషన్ నాయకుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో అంతిమ నిర్ణయం ఉంటుంది ఉంటుందన్నారు నిర్మాతలు మరియు ఫెడరేషన్ నాయకులు. మరోవైపు నిన్న ప్రసాద్ ల్యాబ్ లో రైజింగ్ నిర్మాతల సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు చెప్పారు. నిర్మాతల పెట్టిన 4 కండిషన్స్ కు ఫెడరేషన్ ఒకే అంటేనే వేతనాలు పెంచుతామని చెప్పారు నిర్మాతలు. 30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చి చెప్పారు ఫెడరేషన్ నాయకులు. అలాగే నిన్న సినిమా కార్మికుల సమస్యలు.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు సంబంధించి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు మంత్రి కందుల దుర్గేష్. నేడు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగే నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల చర్చలపైనే అందరి దృష్టి ఉంది. త్వరగా ఈ సమస్యకు పరిస్కారం చూపి షూటింగ్స్ తిరిగి స్టార్ట్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు.