Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..
- కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
- ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
- ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయలు వెల్లడి
- అత్యాచారానికి ముందుగానే ప్లాన్ చేసినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. “ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు. బాధితురాలిపై దాడికి ఒడిగట్టడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు. బాధితురాలు కళాశాలలో అడ్మిషన్ పొందిన మొదటి రోజు నుంచే ప్రధాన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు మేము కనుగొన్నాం” అని ప్రత్యేక దర్యాప్తు బృందంలోని ఓ అధికారి వెల్లడించారు.
READ MORE:J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
Also Read
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
- Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
- Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ముగ్గురు నిందితులైన మోనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్ గతంలో అదే కళాశాలలోని ఇతర విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు సిట్ కనుగొంది. ఈ ముగ్గురు నిందితులు టార్గెట్ చేసి యువతులపై అసభ్యంగా ప్రవర్తించే వారు. తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. అనంతరం ఆ ఫుటేజీని చూయించిబాధితులను బ్లాక్ మెయిల్ చేసేవారు. కోల్‌కతా పోలీసులు ఇప్పుడు నిందితులు రికార్డ్ చేసిన మొబైల్ వీడియోల కోసం శోధిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ముఖర్జీ, అహ్మద్ నివాసాలలో సోదాలు జరిగాయి. జూన్ 25న జరిగిన అత్యాచారానికి సంబంధించిన వీడియో క్లిప్ ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ క్లిప్‌లను ఫార్వార్డ్ చేశారా లేదా మరి ఏదైనా గ్రూపుల్లో పంచుకున్నారా? అని తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని సిట్ బృందం తెలిపింది.
READ MORE: J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!