Site icon NTV Telugu

MP: రాత్రి వేళల్లో సమాధులు నుంచి బయటపడుతున్న మహిళల డెడ్‌బాడీలు.. సీసీ కెమెరాలో భయనక దృశ్యం..!

Mp

Mp

Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్‌లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు. ఈ సమాధులలో ఒకటి కొన్ని రోజుల క్రితం ఖననం చేసిన ఒక మహిళది. రెండవ సమాధి ఇంకా గుర్తించబడలేదు. తారుమారు ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే అంశాన్ని తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటన స్థానిక ముస్లిం సమాజ సభ్యులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. మృతురాలి కుటుంబం, నగర ఖాజీ సయ్యద్ నిసార్ అలీ, కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారులు సహా పెద్ద సంఖ్యలో జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన మహిళ బంధువుల సమక్షంలో సమాధిని పునరుద్ధరించారు.

READ MORE: CM Revanth Reddy : జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలి, నిధులు మంజూరు చేయాలి

అనంతరం.. స్మశానవాటికలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అందులో ఆశ్చర్య, భయానక దృశ్యాలు కనిపించాయి. రాత్రిపూట ఇద్దరు వ్యక్తులు సమాధుల దగ్గర పూర్తి నగ్నంగా తిరుగుతున్నట్లు కనిపించింది. వాళ్లు ఏం చేస్తున్నారో తెలియకుండా దాచిపెట్టడానికి ఇద్దరిలో ఒకరు స్తంభం ఎక్కి సీసీటీవీ కెమెరాను దుప్పటితో కప్పి ఉంచారు. మరోవైపు.. బడా కబ్రిస్తాన్‌లో నాలుగు నెలల కిందట ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అంతలో ఈ ఘటన జరగడం ఆందోళనలను మరింత పెంచింది. ఇక్కడ మే 20వ తేదీ అమావాస్య రాత్రి, రెండు స్మశానవాటికలలో ఆరు సమాధులు తెరిచి ఉండటం కనిపించింది. వాటిలో మూడు మహిళలకు చెందినవి. అయితే.. ఈ ఘటనకు పాల్పడిన ఆ నగ్న యువకులు మంత్రవిద్యల కోసం లేదా మృతదేహాలపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

READ MORE: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. తాలిబన్ల పాలనపై విమర్శలు

Exit mobile version