MP: రాత్రి వేళల్లో సమాధులు నుంచి బయటపడుతున్న మహిళల డెడ్‌బాడీలు.. సీసీ కెమెరాలో భయనక దృశ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్‌లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు. ఈ సమాధులలో ఒకటి కొన్ని రోజుల క్రితం ఖననం చేసిన ఒక మహిళది. రెండవ సమాధి ఇంకా గుర్తించబడలేదు. తారుమారు ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే అంశాన్ని తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటన స్థానిక ముస్లిం సమాజ సభ్యులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. మృతురాలి కుటుంబం, నగర ఖాజీ సయ్యద్ నిసార్ అలీ, కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారులు సహా పెద్ద సంఖ్యలో జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన మహిళ బంధువుల సమక్షంలో సమాధిని పునరుద్ధరించారు.
READ MORE: CM Revanth Reddy : జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలి, నిధులు మంజూరు చేయాలి
Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
అనంతరం.. స్మశానవాటికలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అందులో ఆశ్చర్య, భయానక దృశ్యాలు కనిపించాయి. రాత్రిపూట ఇద్దరు వ్యక్తులు సమాధుల దగ్గర పూర్తి నగ్నంగా తిరుగుతున్నట్లు కనిపించింది. వాళ్లు ఏం చేస్తున్నారో తెలియకుండా దాచిపెట్టడానికి ఇద్దరిలో ఒకరు స్తంభం ఎక్కి సీసీటీవీ కెమెరాను దుప్పటితో కప్పి ఉంచారు. మరోవైపు.. బడా కబ్రిస్తాన్‌లో నాలుగు నెలల కిందట ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అంతలో ఈ ఘటన జరగడం ఆందోళనలను మరింత పెంచింది. ఇక్కడ మే 20వ తేదీ అమావాస్య రాత్రి, రెండు స్మశానవాటికలలో ఆరు సమాధులు తెరిచి ఉండటం కనిపించింది. వాటిలో మూడు మహిళలకు చెందినవి. అయితే.. ఈ ఘటనకు పాల్పడిన ఆ నగ్న యువకులు మంత్రవిద్యల కోసం లేదా మృతదేహాలపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
READ MORE: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. తాలిబన్ల పాలనపై విమర్శలు
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!