Husband Assassination Case: కర్ణాటక బెంగళూరులోని యెళహంకలో ఈ నెల 22వ తేదీన ఓ లేఔట్‌లో భవనంపై చంద్రశేఖర్(35) అనే కార్మికుడు తల, మర్మాంగాలపై గాయాలతో హత్యకు గురైన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో భార్య శ్వేత లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కింది. తమ పచ్చని సంసారంలో ఆరని నిప్పులు పోసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకొని, తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో పడి తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. చివరికి కటకటాలపాలైంది.
అయితే ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులో ఎమ్మెస్సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్ చేసినట్లు తెలిసింది. టీవీలు, సినిమాలు, షికార్లు తిరుగుతూ అదే లోకం అనుకోవడంతో పాటు ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండడం గొప్ప అనుకుని అలాగే చేసేది. ఆమెకు కనీసం 15 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండేవారని, కొన్ని రోజులు షికార్లు చేసిన అనంతరం వారిని బ్లాక్‌లిస్టులో పెట్టేదని తెలిసింది. ఇంటి యజమాని కుమారుడితోనూ సన్నిహితంగా మెలిగింది. అతనితో కలిసి ద్విచక్రవాహనంపై కాలేజీకి కూడా వెళ్లేదని తెలిసింది. ప్రియుడు సురేష్‌తో సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాలు భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు కూడా జరిగేవి. చంద్రశేఖర్‌ను హత్య చేసేందుకు కొత్త సిమ్ కార్డును కొని మరీ ప్లాన్ చేసింది.
Extra Marital Affair: ఆమెకు 19, ఆయనకు 35.. వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలిసి..
శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య ఎన్నో సార్లు గొడవ జరగగా.. భర్త అడ్డు తొలగించుకోవాలని పథకాన్ని రచించింది. ఈ నెల 22వ తేదీన సురేశ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. భర్త చంద్రశేఖర్ విధులు ముగించుకుని ఇంటికి రాగానే నీరు రావట్లేదని.. పైకి వెళ్లి ట్యాంకు చూడమని చెప్పింది. చంద్రశేఖర్ వెళ్లగానే అక్కడ దాగి ఉన్న సురేశ్ రాడ్‌తో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేకుండా సమాధానం చెప్పింది. ఆమెపై అనుమానంతో పీఎస్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నిజాలను బయటపెట్టింది. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
