Site icon NTV Telugu

Hyderabad: ప్రియురాలు గుజరాత్ లో.. ప్రియుడు హైదరాబాద్ లో.. చివరకు ఏమైందంటే?

Dead

Dead

ప్రేమ కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. మరికొందరు జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ఇటీవల ప్రేమ కారణంగా యువతీ యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కలిసి బ్రతకలేమని తెలిసి కొందరు.. ప్రేమకు పెద్దలు అడ్డుచెప్తున్నారని మరికొందరు తనువులు చాలిస్తున్నారు. ప్రేమ కారణంగా అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలు గుజరాత్ లో.. ప్రియుడు హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Also Read:Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ తో గోపీచంద్ మలినేని సినిమా..?

గుజరాత్ లోని కిషన్ గంజ్ ప్రాంతానికి చెందిన మన్సూర్ ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల మన్సూర్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడే పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమైందో ఏమోగాని గుజరాత్ లో ఉన్న మన్సూర్ ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేయసి మరణించిన విషయం మన్సూర్ కు చేరింది. తనతోనే జీవితమనుకున్న మన్సూర్ ప్రియురాలు ప్రాణాలతో లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్రియురాలు గుజరాత్ లో ఆత్మహత్య చేసుకుందని తెలిసి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుస్సేనీ ఆలం పరిధిలో మన్సూర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version