NTV Telugu Site icon

IND vs AUS 2nd test: అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్..!

Team India

Team India

అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. పింక్ బాల్ మ్యాచ్‌కు భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం కష్టమే అనిపిస్తుంది. గిల్ బొటనవేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. నవంబర్ 30 నుండి కాన్‌బెర్రాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే.. పెర్త్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్‌కు గాయమైంది. ఈ క్రమంలో.. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టులో ఆడేందుకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

Read Also: ICC Test Ranking: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో నెంబర్-1 బౌలర్‌ మనోడే..

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ‘గిల్ పూర్తిగా కోలుకునే వరకు బ్యాటింగ్ చేయడు. అడిలైడ్ టెస్టుకు ముందు అతని ఆట సమయం నిర్ణయించబడుతుంది. గిల్ గాయపడిన తర్వాత, వైద్య నిపుణుడు 10-14 రోజులు విశ్రాంతి తీసుకోవాలి’ అని సూచించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఒక మూలం తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఆడడు, రెండో టెస్టులో అతను పాల్గొనడం అనుమానమే అన్నట్లు పేర్కొంది.

Read Also: Maharashtra CM: కొనసాగుతున్న ‘‘మహా’’ సస్పెన్స్.. సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..

శుభమాన్ గిల్ రెండో టెస్టుకు ఫిట్‌గా లేకుంటే.. కేఎల్ రాహుల్ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేయగలడు. పెర్త్ టెస్టులో రాహుల్ 103 పరుగులు చేశాడు. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీ కూడా ఉంది. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో రాహుల్ కు ఓపెనింగ్ అవకాశాలు తక్కువ. వ్యక్తిగత కారణాలతో రోహిత్ సెలవులో ఉండటంతో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. రోహిత్ జట్టులో చేరుతుండటంతో దేవ్‌దత్ పడిక్కల్ జట్టులో ఆడుతాడా లేదా అన్నది అనుమానమే.