Cheekatilo : శోభిత ధూళిపాల ‘చీకటిలో’ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు బిజీగా ఉన్న శోభితా ధూళిపాళ్ల, ఒక పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తోంది. ఆమె మెయిన్ లీడ్‌లో నటించిన ‘చీకటిలో’ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా ఈ సినిమాలో శోభిత ఒక పాడ్‌కాస్టర్‌గా కనిపిస్తూ, హైదరాబాద్‌లోని కొన్ని భయంకరమైన మిస్టరీలను ఛేదించబోతోంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటేనే చాలా గగుర్పొడిచేలా ఉంది.
Also Read : Vaa Vaathiy : ‘జన నాయగన్’ అవుట్ తో..కార్తీకి గోల్డెన్ ఛాన్స్?
Also Read
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
‘చీకట్లు కమ్ముకునే ముందే సంధ్య వచ్చేస్తుంది.. సిద్ధంగా ఉండండి’ అంటూ వచ్చిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ లోతైన నిజాలను ఎలా బయటపెట్టిందనేది అసలు కథ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. సంక్రాంతి హడావిడి ముగిశాక, జనవరి చివర్లో ప్రైమ్ వీడియోలో ఈ ‘చీకటి’ రచ్చ మొదలవబోతోంది.
తాజావార్తలు
-
Peddi : అదిరిందిపోయిన రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రోమో..
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!