Shobha Shetty: నాగార్జున ఇచ్చిన టీ షర్ట్ ను శోభా శెట్టి ఏం చేసిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శోభా శెట్టి అలియాస్ మోనిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది..ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో ఛాన్స్ కొట్టేసింది..
ఈ సారి ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ భయపకుండా , తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్ చూసి ముచ్చట పడింది.. ఆ షర్ట్ కావాలని అడిగింది..
Also Read
- Amardeep -Teju : కొత్త కారును కొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ధర ఎంతో తెలుసా ?
- Pallavi Prasanth : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు బిడ్డ.. ధర ఎంతో తెలుసా?
- Bigg Boss Keerthi : పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాం.. కాబోయే భర్త గురించి కీర్తి ఓపెన్ కామెంట్స్..
- Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..
ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ ఇప్పుడు ఆ షర్ట్ ను శోభాకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది.నాగార్జున ధరించిన టీ షర్ట్ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్ అయ్యాను. నేను టీ షర్ట్ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్ అయిన రోజు నాగ్ సర్ స్వయంగా ఆ టీషర్ట్ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్ కూడా చేశాను’ అంటూ తన ఛానెల్ లో తెలిపింది.. అంత ఇష్టంగా తీసుకున్న టీ షర్ట్ ను అమర్ దీప్ కు ఇచ్చింది.. ఎంతో ఇష్టపడిన ఆ టీ షర్ట్ ను అతనికి ఎందుకు ఇచ్చిందో అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సీరియల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..