NTV Telugu Site icon

Abdul Razzaq-Aishwarya Rai: రజాక్‌.. కాస్తైనా సిగ్గుండాలి! ఐశ్వర్య రాయ్‌ కామెంట్లపై స్పందించిన అక్తర్‌

Abdul Razzaq Aishwarya Rai

Abdul Razzaq Aishwarya Rai

Shoaib Akhtar React on controversial remark on Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్‌ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్రికెట్‌తో ఏ సంబంధం లేని ఐశ్వర్యను వివాదంలోకి లాగడమే కాకుండా.. చీప్‌ కామెంట్స్‌ చేసిన రజాక్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ నుంచి మాత్రమే కాదు.. సొంత దేశం నుంచి కూడా రజాక్‌పై మండిపడుతున్నారు. తాజాగా మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. మహిళలను కించపరచడం మంచి పద్ధతి కాదని, అలా కామెంట్స్ చేయడానికి కాస్తైనా సిగ్గుండాలన్నాడు.

వరుస ట్వీట్స్ చేస్తూ అబ్దుల్ రజాక్‌పై షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. ‘ఐశ్వర్య రాయ్‌పై అబ్దుల్ రజాక్ చేసిన అసంబద్దమైన జోక్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ స్త్రీని ఇలా అగౌరవపరచకూడదు. రజాక్ పక్కన కూర్చున్న వ్యక్తులు ఈ వ్యాఖ్యలను ఆపాల్సింది పోయి.. నవ్వడం, చప్పట్లు కొట్టడం సరికాదు’ అని అక్తర్‌ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై షాహిద్‌ అఫ్రిదితో తాను ఫోన్‌లో మాట్లాడానని అక్తర్‌ మరో ట్వీట్‌లో తెలిపాడు. ‘షాహిద్‌ అఫ్రిదీతో ఫోన్‌లో మాట్లాడా. అబ్దుల్‌ రజాక్‌ ఏం మాట్లాడాడో తనకు సరిగా అర్థం కాలేదని అఫ్రిదీ నాతో అన్నాడు. రజాక్‌ మాటలను అఫ్రిదీ ఖండించాడు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

Also Read: Telangana Election 2023: నేటి నుంచి ఓటరు చీటీల పంపిణీ.. 23 వరకు కొనసాగునున్న ప్రక్రియ

అసలేం జరిగిందంటే… వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ దారుణంగా విఫలమవ్వగా.. ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. మాజీ ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్ కరాచీలో ఏర్పాటు చేసిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌తో పాటు పీసీబీపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్.. ఐశ్వర్య రాయ్‌ను ప్రస్తావిస్తూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ‘పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. కెప్టెన్‌గా యూనిస్ ఖాన్ జట్టును అత్యుత్తమంగా నడిపాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తి బిన్నంగా మారింది. క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాకిస్థాన్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి?. నేను ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారా?. ఇది కూడా అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే ఫలితాలు వస్తాయి’ అని రజాక్ ఉదాహారణగా చెప్పాడు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

Show comments