Astrologer Sumit Bajaj Said India Will Reach ODI World Cup 2023 Finals: ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. భారత్, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్‌లో తలపడనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రపంచకప్‌లో టీమిండియాను కివీస్ ఓడించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే అదంతా ఈజీ కాదు. 2003 నుంచి మెగా టోర్నీలలో న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈసారి భారత్ వరుస విజయాలు సాధించడంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ స్పందించారు.
భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, వాంఖడేలో ఏ టీమ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది, మ్యాచ్‌లో ఏ ఆటగాళ్లు టాప్ పెర్ఫార్మర్స్‌గా నిలుస్తారని ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ అంచనా వేశారు. ముంబైలో భారత్ సెమీ ఫైనల్ ఆడుతుందన్న తన అంచనా నిజమైందని, ఇక అహ్మదాబాద్‌లో రోహిత్ సేన ఫైనల్ ఆడుతుందని బజాజ్ తెలిపారు. బుధవారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తుందని వెల్లడించాడు.
‘నేను ఇదివరకు చెప్పినట్టే భారత్ ముంబైలో సెమీ ఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్‌పై గెలిచి అహ్మదాబాద్‌లో ఫైనల్స్ కూడా ఆడుతుంది. ఇప్పుడు భారత్ జట్టుకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. భారత స్టార్స్ మ్యాచ్‌ను గెలిస్తారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తుంది. కివీస్ 250-270 లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. 47-48వ ఓవర్లో భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, గిల్, రోహిత్ కీలక పాత్ర పోషిస్తారు. భారత్ కెప్టెన్ జాతకం చాలా బాగుంది. కాబట్టి రోహిత్ జట్టు ప్రదర్శనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఫైనల్స్‌లో భారత్ కప్‌ను కైవసం చేసుకోవడంలో కూడా రోహిత్ సహాయం చేస్తాడు. అతని వయస్సు 37 సంవత్సరాలు, ఖచ్చితంగా చెప్పాలంటే 36.5 సంవత్సరాలు. ఈ దశ టీమిండియాను ముందుకు తీసుకెళ్లడానికి రోహిత్ శర్మకు చాలా అనుకూలంగా ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం పీక్‌లో ఉన్నాడు’ అని సుమిత్ బజాజ్ తెలిపారు.
Also Read: IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
‘సూర్య కుమార్ యాదవ్ నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడుతాడు.సెమీస్ మ్యాచ్‌లో కూడా అతడు మంచి ప్రదర్శన చేస్తాడు. భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజాలు బాగా ఆడతారు. ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే.. మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే వంటి కొందరు ప్లేయర్స్ రాణించొచ్చు. సెమీస్ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర రాణించలేకపోవచ్చు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతడు వికెట్ కోల్పోతాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పెద్దగా కష్టపడకపోవచ్చు. అయితే కివీస్ నుంచి మాత్రం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి’ అని సుమిత్ బజాజ్ పేర్కొన్నారు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని జోస్యం చెప్పిన అనిరుధ్ కుమార్ మిశ్రా.. 2023లో రోహిత్ సేన కచ్చితంగా విశ్వ విజేతగా నిలుస్తుందని చెప్పారు.