NTV Telugu Site icon

Mahanandi: మహానంది క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 11 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Mahanandi

Mahanandi

Mahanandi: ప్రముఖ మహానంది క్షేత్రంలో 6 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అభిషేకాలు, విశేష పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేపట్టనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు కామేశ్వరీ దేవి సహిత మహానందిశ్వర స్వామి వార్ల కళ్యాణం జరగనుంది.

Read Also: YSRCP: సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన భూమా కిషోర్‌ రెడ్డి

9న కళ్యాణమూర్తులకు పల్లకి సేవ, 10న మహారథోత్సవం జరగనున్నాయి. 11న త్రిశూల స్నానం , తెప్పోత్సవంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి. ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా క్యూలైన్లు ఏర్పాటు, 10 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. లక్షన్నర లడ్డూలు సిద్ధం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 6 నుండి 11 వ తేదీ వరకు స్పర్శ దర్శనాలు రద్దు చేశారు.