ప్రముఖ మహానంది క్షేత్రంలో 6 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అభిషేకాలు, విశేష పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేపట్టనున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో గోపురాలను విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చె భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
Shivratri Brahmotsavam 2023: శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి.. శివరాత్రికి ముందే ప్రముఖ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు మొదలవుతుంటాయి.. ఇక, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ప్రతీ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.. శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ ఉదయం 9 గంటలకు…