కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ హీరో తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఈ యంగ్ హీరో రీసెంట్ గా నటించిన మహావీరుడు సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ‘అయలాన్’ అంటే తమిళంలో ‘ఏలియన్’ అని అర్థం.సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది.ఆర్.రవికుమార్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు . ఇందులో భాగంగా శివ కార్తికేయన్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు.
అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక పై ఏ సర్టిఫికెట్ సినిమాలు చేయలనుకోవడం లేదని.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసే కథల ను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు శివ కార్తికేయన్ వెల్లడించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. అయలాన్ లో శివకార్తికేయన్, రకుల్ తో పాటు ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్ మరియు బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.