Shikha Goyal: లోన్ యాప్ మోసాలు ప్రస్తుతం తగ్గాయని తెలంగాణ సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. లోన్ యాప్‌లు తక్కువ సంఖ్యలో యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. పోలీస్ అధికారులు అంటూ ఎవరు కాల్ చేసినా కాల్ కట్ చేయాలన్నారు. అనుమానం వస్తే మాకు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో కింగ్ పిన్‌లను అరెస్ట్ చేసేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్ అందుబాటులో ఉన్నారన్నారు. ప్రతి సైబర్ వారియర్స్‌కు ప్రభుత్వం ఎక్స్‌క్లూజివ్ మొబైల్‌ను సమకూర్చిందని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ప్రభుత్వ సహకారం చాలా బాగుందని సీఐడీ డీజీ షికా గోయల్ స్పష్టం చేశారు.
Read Also: Shikha Goyal: సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదిక విడుదల