Shikha Goyal: సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదికను సీఐడీ డీజీ షికా గోయల్ విడుదల చేశారు. ఈ సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల కోసం మూడు ఆపరేషన్స్ నిర్వహించినట్లు శిఖా గోయల్ తెలిపారు. ఈ ఏడాది 18 నుండి 20 శాతం సైబర్ నేరాలు పెరిగాయని వెల్లడించారు. ఈ సంవత్సరం రూ.176 కోట్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇచ్చామన్నారు. సైబర్ నేరగాళ్ల అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని.. 1,057 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని ఆమె తెలిపారు. వీరు తెలంగాణలో 19 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని.. దేశవ్యాప్తంగా ఈ నిందితులు ఇన్వాల్వ్ అయిన కేసులు లక్షల్లో ఉన్నాయన్నారు. సైబర్ నేరాల దర్యాప్తు సమర్థవంతమైన టూల్స్ సైబర్ బ్యూరోతో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం 9800 ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేయడం ద్వారా నేరగాళ్లు మొబైల్స్ పని చేయకుండా చేశామన్నారు. గత సంవత్సరం 181 ఐఎంఈఐ నంబర్లను మాత్రమే గత సంవత్సరంలో బ్లాక్ చేశామని శిఖా గోయల్ తెలిపారు. యూఆర్ఎల్, వెబ్‌సైట్లను కూడా బ్లాక్ చేశామన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం, సందేహాల నివృత్తి కోసం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతిసారి 1930 బిజీగా ఉండటం వల్ల వెయిటింగ్ సమయం పెరుగుతుందన్నారు. దీంతో ఓ ఏఐ టూల్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
Read Also: Vijayawada: న్యూ ఇయర్‌కు కొత్త బ్రాండ్లతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైన బెజవాడ
సైబర్ నేరగాళ్లకు నగదు డ్రా చేసి ఏజెంట్ల ద్వారా ప్రధాన నేరగాళ్లకు పంపిస్తున్న 21మందిని అరెస్ట్ చేశామని సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల ఖాతాలో పడ్డ సొమ్మును sజెంట్లు క్రిప్టోగా మర్చి ఇతర దేశాలకు పంపిస్తున్నారన్నారు.ఈ ఖాతాలు దేశావ్యాప్తంగా 714 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాయన్నారు. కొందరు నేరగాళ్లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మొత్తం ఈ ఖాతాల ద్వారా రూ.8.2 కోట్లు డ్రా చేసి విదేశాలకు పంపారన్నారు. పట్టుబడ్డ వారిలో 13మంది ఖాతాదారులు, 8మంది ఏజెంట్లు ఉన్నారని వెల్లడించారు. 8 మంది ఏజెంట్లు దేశవ్యాప్తంగా 325 కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఆమె తెలిపారు. గతంలో ఖాతాలు సమకూర్చిన వారిని మాత్రమే అరెస్ట్ చేశామన్నారు. ఇప్పుడు విత్ డ్రా చేసి ఇతర దేశాలకు పంపుతున్న వారిపై దృష్టి సారించినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: క్షేత్రస్థాయిలో పవన్ కల్యాణ్ పర్యటన.. రోడ్డు తవ్వి మరీ నాణ్యత పరిశీలన..!
ప్రస్తుతం విత్ డ్రా చేసి ఇస్తున్న అకౌంట్స్ అన్ని సేవింగ్స్ అకౌంట్స్ అని ఆమె తెలిపారు. ఒక్కో అకౌంట్ నుండి ఐదు నుండి పది లక్షలు వరకు విత్ డ్రా చేసి ఇచ్చారన్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్‌ను ఏజెంట్స్ పంచుకుంటున్నారని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా అమౌంట్‌ను ఏజెంట్లు దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నేరస్థులపై మూడు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామన్నారు. కంబోడియా కేసులో దావూద్‌ని ఇటీవల అరెస్ట్ చేశామని.. 30 మంది యువతను కంబోడియాకు పంపించారని చెప్పారు. అక్కడ చైనీస్ కాల్ సెంటర్లకి 30 మందిని బదిలీ చేశారన్నారు. ఇప్పటివరకు 20 మంది ఏజెంట్స్ అరెస్ట్ అయ్యారన్నారు. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసి దావూద్‌ను అరెస్ట్ చేశామన్నారు. టూరిస్ట్ వీసాలపై అమాయకులను మోసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామమని వెల్లడించారు. లోన్ యాప్ వేధింపులు క్రమంగా తగ్గాయని సీఐడీ డీజీ షికా గోయల్ స్పష్టం చేశారు.