NTV Telugu Site icon

Accident: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని గొర్రెల కాపరి, 80 గొర్రెలు మృతి

Train

Train

Accident: రైలు ఢీకొని 80 గొర్రెలతో పాటు గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన హన్మకొండలోని శాయంపేట రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. శాతవాహన రైలు వస్తున్న క్రమంలో గేటు వేయగా.. కాపరి గొర్రెలను కొట్టుకుని ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. కానీ రైలు అనుకున్న దానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైన ఉండిపోయాయి. వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టగా గొర్రెలతో పాటు గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టాలపై గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read Also: Flight: నిద్రలోకి జారుకున్న పైలట్లు.. ప్లైట్ మిస్సింగ్! తప్పిన ముప్పు!