Site icon NTV Telugu

Shashi Tharoor : మాట తప్పడం వారి నైజం

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor : ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై అంగీకారం ప్రకటించిన కొన్ని గంటలకే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం రాత్రి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హిందీలో ఓ ద్విపదను పోస్ట్ చేసిన ఆయన, “ఉస్కీ ఫిత్రత్ హై ముకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?” అంటూ వ్యంగ్యంగా విసిరారు. దీని అర్థం: “మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను ఎలా నమ్మను?” — అని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్‌కు #ceasefireviolated అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.భారత్, పాకిస్థాన్ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్న ప్రకటన చేసిన కొద్ది సమయంలోనే పాక్‌ దానిని ఉల్లంఘించినట్టు భారత అధికారులు వెల్లడించారు.

India-Pak Ceasefire: ఇండియా-పాక్ కాల్పుల విరమణ.. సోషల్ మీడియాలో నెటిజన్స్ రియక్షన్స్

అనంతరం భారత సైన్యం తగిన విధంగా స్పందించినట్టు రాత్రి ప్రకటన విడుదలైంది. ఇక శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ, “భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ గుణపాఠం చెప్పామని నేను నమ్ముతున్నాను,” అన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన “ఆపరేషన్ సిందూర్”ను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Jayam Ravi : బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు .. స్టార్ హీరో వైఫ్ పోస్ట్ వైరల్

Exit mobile version