Shashi Tharoor : మాట తప్పడం వారి నైజం
- థరూర్ కవితలో వ్యంగ్య వ్యాఖ్యలు
- కాల్పుల విరమణ కొద్దిసేపటికే పాక్ ఉల్లంఘన
- ఆపరేషన్ సిందూర్‌పై థరూర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor : ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై అంగీకారం ప్రకటించిన కొన్ని గంటలకే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం రాత్రి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హిందీలో ఓ ద్విపదను పోస్ట్ చేసిన ఆయన, “ఉస్కీ ఫిత్రత్ హై ముకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?” అంటూ వ్యంగ్యంగా విసిరారు. దీని అర్థం: “మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను ఎలా నమ్మను?” — అని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్‌కు #ceasefireviolated అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.భారత్, పాకిస్థాన్ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్న ప్రకటన చేసిన కొద్ది సమయంలోనే పాక్ దానిని ఉల్లంఘించినట్టు భారత అధికారులు వెల్లడించారు.
India-Pak Ceasefire: ఇండియా-పాక్ కాల్పుల విరమణ.. సోషల్ మీడియాలో నెటిజన్స్ రియక్షన్స్
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అనంతరం భారత సైన్యం తగిన విధంగా స్పందించినట్టు రాత్రి ప్రకటన విడుదలైంది. ఇక శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ, “భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ గుణపాఠం చెప్పామని నేను నమ్ముతున్నాను,” అన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన “ఆపరేషన్ సిందూర్”ను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
Jayam Ravi : బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు .. స్టార్ హీరో వైఫ్ పోస్ట్ వైరల్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..