Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand : టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్‌లో ఒక ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్నారు వీరు. తాజాగా ఈ సీనియర్ జంటపై యువ హీరో శర్వానంద్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా బైకర్. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న శర్వానంద్.. రాజశేఖర్ – జీవితల మధ్య ఉన్న బంధం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
READ ALSO: PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!
Also Read
“రాజశేఖర్ గారిని చూస్తుంటే అప్పుడప్పుడు నాకు చాలా జెలస్‌గా అనిపిస్తుంది. దానికి కారణం జీవిత గారు. ఆమె రాజశేఖర్ గారిని ఇప్పటికీ ఒక చిన్న బాబుని చూసుకున్నట్టు అంత అపురూపంగా చూసుకుంటారు. ఆయన ఆరోగ్య విషయంలో కానీ, ఇతర పనుల్లో కానీ ఆమె చూపే శ్రద్ధ, ప్రేమ నిజంగా గ్రేట్” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. వయసు పెరుగుతున్నా, ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా జీవిత గారు ఎప్పుడూ రాజశేఖర్ గారి వెంటే ఉంటూ ఆయనకు అండగా నిలబడటం మనం చూస్తూనే ఉంటాం, షూటింగ్ స్పాట్లలో కూడా ఆయన అవసరాలను ఆమె దగ్గరుండి చూసుకుంటారని శర్వానంద్ అన్నారు. శర్వానంద్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. “నిజమే.. రాజశేఖర్ గారికి – జీవిత గారి లాంటి భాగస్వామి దొరకడం చాలా అదృష్టం” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: Shashi Tharoor : కేరళంలో కాంగ్రెస్ అగ్రనాయకుడి కాన్వాయ్‌పై దాడి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!