Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!

  • దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్లమ్మ’.
  • 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల..
Yellamma

Yellamma

Yellamma Release Date: టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్లమ్మ’. ఇప్పటికే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఇందులో దేవిశ్రీని ‘పర్షి’ పాత్రలో పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

తొలుత ఈ స్లాట్‌లో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా అక్టోబర్‌కు వాయిదా పడటంతో ‘ఎల్లమ్మ’ ఆ స్థానాన్ని దక్కించుకుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.