Site icon NTV Telugu

Maharashtra: ఏక్ నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ( ఎన్సీపీ ) అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారి ఈ విషయం పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన షిండేతో శరద్‌ పవార్‌ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంపై అనేక ఊహాగానాలకు దారితీసింది. అయితే ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Adipurush: జై హనుమాన్… ఓం మావ స్పీడ్ పెంచాడు

ముంబైలోని మరాఠా మందిర్‌ అమృత్‌ మహోత్సవ్‌ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి షిండేని తాను కలిశానని శరద్ పవార్‌ ట్వీట్‌ చేశారు. మరాఠీ సినిమా, థియోటర్‌, ఆర్ట్‌ రంగానికి చెందిన కళాకారుల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం సైతం ఇదే విషయాన్ని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. బీజేపీ కూడా ఈ సమావేశంపై రియాక్ట్ అయింది. ఈ భేటికీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరణ ఇచ్చింది.

Also Read : Andhrapradesh: ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు

అయితే శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉంటే దాన్ని తప్పకుండా స్వాగతిస్తామని మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా శరద్ పవార్ బీజేపీకి దగ్గర అవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఏంత వరకు నిజం అనేది మాత్రం తెలియారాలేదు.

Exit mobile version