Site icon NTV Telugu

Hyderabad Road Accident: బైక్‌ ఢీ కొనడంతో పూర్తిగా దగ్ధమైన బస్సు.. ఓ వ్యక్తి మృతి!

Road Accident

Road Accident

One Person Died after Bike Hits Bus in Shamirpet: శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ ఢీ కొట్టడంతో ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ కుమార్ (26) యూజే ఫార్ములా కంపెనీలో పని చేస్తున్నాడు. విధుల నిమిత్తం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తన బైక్‌పై బయలుదేరాడు. కొల్తూరు వద్ద ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును అతడు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సంపత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read: Yuzvendra Chahal: ఆ కారణంతోనే యుజువేంద్ర చహల్‌కు జట్టులో చోటు దక్కలేదు!

బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ లీకై మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలు బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్‌తో పాటు బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సుకు మంటలు అంటుకోగానే.. అందులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

 

Exit mobile version