NTV Telugu Site icon

YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు

Ysrcp

Ysrcp

YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత చిన అప్పలనాయుడు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పల నాయుడు బొబ్బిలి నుంచి 4సార్లు గెలిచారు. 2019లో ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నెల 28న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. అంటే గట్టిగా ఇరవై రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్‌ నాయకుడిని బరిలో నిలిపింది.

Read Also: Somu Veerraju : కూటమి ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతుంది

 

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడును నిర్ణయించామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయించామన్నారు. పార్టీ నాయకులు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పలనాయుడు పేరు ప్రకటించామని వెల్లడించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌నేత బొత్సకు అవకాశం కల్పించామన్నారు. ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పలనాయుడు పేరు ప్రకటించామన్నారు. అప్పలనాయుడు అనుభవజ్క్షడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచామని వెల్లడించారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలన్నారు. విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని.. ఇందులో 592 మంది వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారన్నారు.