NTV Telugu Site icon

Shalibanda PS: శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు.. డీజీపీ అభినందనలు

Shalibanda Ps

Shalibanda Ps

Shalibanda PS: శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికయ్యింది. ఈ ఘనతను భువనేశ్వర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక డీజీపీ/ఐజీపీ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థకు ఈ గుర్తింపు మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది.

Read Also: Telangana: విద్యుత్‌ రంగంలో కొత్త విప్లవం.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి

ఈ సందర్భంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్‌ను, శాలిబండ పోలీస్ స్టేషన్ బృందానికి డీజీపీ జితేందర్‌ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. “ఈ రోజు డీజీపీ/ఐజీపీ కాన్ఫరెన్స్‌లో శాలిబండ పోలీస్ స్టేషన్, దేశంలో 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ప్రకటించబడింది. హైదరాబాద్ సీపీ మరియు బృందానికి హృదయపూర్వక అభినందనలు. అందరికీ అభినందనలు.” తెలిపారు. ఈ గుర్తింపు తెలంగాణ పోలీస్ విభాగం యొక్క నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మక పోలీసింగ్ విధానాలకు నిదర్శనమని డీజీపీ స్పష్టంగా తెలియజేశారు. తెలంగాణ పోలీసులు ప్రజల భద్రత, సమర్థవంతమైన చట్ట అమలు, ఆదర్శప్రాయమైన సేవలు అందించడంలో తమ అంకితభావాన్ని నిరూపించుకుంటున్నారని ఈ జాతీయ పురస్కారం తెలియజేస్తుంది.

Show comments