NTV Telugu Site icon

Shakib Al Hasan : అందుకే నల్లదారం కొరుకుతూ బ్యాటింగ్..

Shakibal Hasan

Shakibal Hasan

Shakib Al Hasan: భారత్‌తో జరుగుతున్న రెండో చెన్నై టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారత బౌలర్లపై తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. అయితే, ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతని ఒక వింత అలవాట్ల కారణంగా వార్తల్లో నిలిచాడు. షకీబ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అభిమానులు, వ్యాఖ్యాతలు ఒక విషయం గమనించారు. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల దారాన్ని నమలుతూ కనిపించాడు. సాధారణంగా ఏ బ్యాట్స్‌మెన్ కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు ఇలాంటివి చేయడు. షకీబ్ చేసిన ఈ వింత చర్యను కెమెరాలకు అందకుండా చూడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Bihar : సైకిల్ దొంగతనం చేశారనే అనుమానంతో ముగ్గురిపై గుంపు దాడి.. ఒకరి హత్య

షకీబ్‌కి ఉన్న ఈ ప్రత్యేకమైన అలవాటు గురించి వ్యాఖ్యాత ప్యానెల్ సభ్యుడు దినేష్ కార్తీక్ మాట్లాడు. దింతో మరో కామెంటేటర్, మాజీ బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ తన బ్యాటింగ్ సమయంలో షకీబ్‌కు ఈ థ్రెడ్ సహాయపడుతుందని చెప్పాడు. ఇలా చేయడం వల్ల షకీబ్ ఏకాగత్రతో ఉండడానికి సహాయ పడుతుందని తెలిపాడు. దారాన్ని నమలడం వల్ల తల అటు వైపు ఇటువైపు తిప్పకుండా ఉంచేందుకు సహాయపడుతుందని తెలిపాడు. అంటే షకీబ్ తనను తాను నియంత్రించుకోవడానికి ఇలా చేశాడని వివరించాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ 149 పరుగుల వద్ద ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 376 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దింతో బంగ్లాదేశ్ జట్టుకు 515 పరుగుల లక్షాన్ని ఇచ్చింది.