NTV Telugu Site icon

Shakib Al Hasan: కాస్త డాక్టర్స్ కు చూపించండయ్యా.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేసిన బంగ్లా స్టార్ ప్లేయర్‌..

Hasan

Hasan

క్రికెట్‌లో ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపించడం సహజం. దాంతో వారు కొన్నిసార్లు వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పరిస్థితి వేరు. షకీబ్ మైదానంలోనే కాకుండా బయట కూడా కోపంగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు అభిమానులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. నిజానికి షకీబ్ కు కోపం కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. అతను తరచుగా హద్దులు దాటుతున్నాడు. అప్పుడప్పుడూ అభిమానులు, సహచరులు, మ్యాచ్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా షకీబ్‌ ఓ అభిమానితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది.

Also read: Viral Video: ఫెయిలైన విమానం ల్యాండింగ్ గేర్.. మరి ల్యాండ్ అయ్యిందంటే..

తాజాగా ఓ అభిమానిపై షకీబ్ తన కోపాన్ని ప్రదర్శించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ అభిమాని తనతో సెల్ఫీ దిగాలని పట్టుబట్టడంతో షకీబ్‌కి కోపం వచ్చింది. ఆ అభిమానిని షకీబ్ పదే పదే తిరస్కరించాడు. కానీ అభిమాని ఒప్పుకోకపోవడంతో కోపంతో షకీబ్ మెడ పట్టుకున్నాడు. ఆ తర్వాత షకీబ్‌ ఫ్యాన్‌ని తోసేసి, అభిమానిని కొట్టేందుకు చేయి పైకెత్తాడు.

Also read: Shocking Video: దేవుడా కుక్కలు బాబోయ్ కుక్కలు.. లిఫ్ట్‌లో బాలికపై దాడి చేసిన శునకం..

2024 టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ముమ్మరంగా సిద్ధమవుతోంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌, అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ప్రపంచకప్ శిక్షణ గురించి షకీబ్ మాట్లాడుతూ.. గత ప్రపంచకప్‌లో మా పరిస్థితిని సమీక్షించుకుని, ఈ ప్రపంచకప్‌లో కొత్త బెంచ్‌ మార్క్‌ను నెలకొల్పి ముందుకు సాగుతాం. తొలి రౌండ్‌లో మూడు గేమ్‌లు గెలవాలనుకుంటున్నాం అని తెలిపారు.