బంగ్లాదేశ్ జట్టుకు సారథి మళ్లీ మాజీనే ఎంపిక చేశారు. ఇంతకుముందు తమీమ్ ఇక్భాల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించగా ఆ ఆటగాడు తప్పుకున్నాడు. దీంతో ముందు జరగబోయే ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ లో బలమైన సారథిని నియమించాలని బంగ్లా క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది. దీంతో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం తెలిపింది.
అంతేకాకుండా.. ఈ రెండు మెగా ఈవెంట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు. “ఆసియా కప్, వరల్డ్ కప్‌లో తమ జట్టు కెప్టెన్‌గా షకీబ్‌ను నియమించామన్నారు. రేపు(ఆగస్టు 12)న ఈ రెండు ఈవెంట్లకు తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Botsa Satyanarayana: 15 ఏండ్లు అవుతుంది దుకాణం తెరిచి.. అందులో ఏ వస్తువు లేదు
షకీబ్ అల్ హాసన్ ప్రస్తుతం టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు అంతకుముందు 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ అల్ హసనే వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ వన్డే ప్రపంచకప్ కు ముందు సారథిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇక ఆసియాకప్-2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. వరల్డ్ కప్ లో ఆక్టోబర్ 7న ఆఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.