NTV Telugu Site icon

Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ పై ‘మర్డర్ కేసు’ నమోదు..

Shakib

Shakib

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు నమోదైంది. కాగా.. రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో షకీబ్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం. అయితే.. షకీబ్ రెండో టెస్టు మ్యాచ్ ఆడుతాడా లేదా అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.

Read Also: Jogi Rajeev: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్

శుక్రవారం విడుదల చేసిన ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్‌లో షకీబ్ అల్ హసన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో క్రికెటర్ షకీబ్‌ను 28వ నిందితుడిగా.. నటుడు ఫిర్దౌస్ అహ్మద్‌ను 55వ నిందితుడిగా చేర్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వీరిద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు.

United Nations: మోడీ పర్యటనతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!.. ఐరాస చీఫ్ ఆశాభావం

కోర్టు ప్రకటన ప్రకారం.. ఆగస్ట్ 5న రూబెల్ అడాబోర్‌లోని రింగ్ రోడ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రూబెల్ ఛాతీ, కడుపులో బుల్లెట్లు తగిలాయి. దీంతో.. తీవ్రంగా గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 7న మృతి చెందాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్‌ ఇస్లామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.