Jubilee Hills Peddamma Thalli Temple: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు.. ఇవాళ్టితో ముగియనున్నాయి.. అభిషేకాలు, ప్రత్యేక పూజలు అమ్మవారికి ఘనంగా నిర్వహిస్తున్నారు.. భక్తులందరు ఈ మహత్తరమైన శాకంబరి ఉత్సవాలను కనులారా తిలకించి.. శ్రీ పెద్దమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి, ఆ లోకమాత.. ఆదిపరాశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి అయిన పెద్దమ్మ తల్లి కృపాకటాక్షములకు పాత్రులై తరించాలని ఆలయ ఫౌండర్ ట్రస్టీస్ పి. ఇందిరా జనదార్ధన్ రెడ్డి మరియి మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్దన్ రెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు..
Read Also: Ram Setu: రామసేతు వంతెన నిజమే.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..!
ఇవాళ్టి కార్యక్రమాలు:
ఉదయం 6 గంటలకు దర్శనము, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగములు..
ఉదయం 8 గంటల నుంచి నవగ్రహ హోమము, రుద్ర, చండీ మోమములు, బలిహారణం
మధ్యాహ్నం 12.10 గంటల నుంచి పూర్ణాహుతి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగములు, యజ్ఞరక్ష, కలశోద్వాసన, ప్రోక్షణ, ఆశీర్వచనములు, బుత్తిక సన్మానములు..
రాత్రి 8 గంటలకు హారతి, మంత్ర పుష్పము.. శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి పల్లికి సేవ, విశేష బాణాసంచా విన్యాసములు.. తదుపరి తీర్థప్రసాద వినియోగములు..
రాత్రి 9 గంటలకు దేవస్థాములో అలంకరణ గావించిన కూరగాయలు భక్తులకు వితర చేయబడును అని.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ కార్యనిర్వాహణాధికారి జి. శ్రీనివాస రాజు పేర్కొన్నారు.