Suhana Khan: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానాకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మొన్నటి వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సుహానా త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏ పని చేసినా వైరల్ అవుతోంది. తాజాగా సుహానా ఖాన్ గురించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె ఇటీవల మహారాష్ట్రలోని అలీబాగ్‌లో కొన్ని కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ వార్త జోరుగా హల్ చల్ చేస్తుంది.
Read Also:Prawns Biryani: 15 నిమిషాల్లోనే రొయ్యల బిర్యాని రెడీ..
సుహానా ఖాన్ మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతం పరిధిలోని థాల్ అనే గ్రామంలో దాదాపు రూ.13 కోట్లకు 1.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన లావాదేవీలు జూన్ 1న జరిగాయని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ పేపర్లలో వ్యవసాయ భూమితోపాటు 2,218 చదరపు అడుగుల నిర్మాణాలు నమోదయ్యాయి. ఆమెను వ్యవసాయవేత్తగా పేపర్లతో చూపించినట్లు సమాచారం. అదే అలీబాగ్‌లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన బంగ్లా కూడా షారుఖ్‌కు ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఉన్నాయి. ఇక్కడే షారుఖ్ తన 52వ పుట్టినరోజు సందర్భంగా అతిథులకు ట్రీట్ ఇచ్చాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వంటి టాప్ సెలబ్రిటీలకు కూడా ఈ ప్రాంతంలో ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు ప్రస్తుతం చేరింది.
Read Also:Government Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. 1,827 కొత్త పోస్టులు
సుహానా ఖాన్‌కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. గతంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. ఆమెకు ఎక్కువగా క్రీడలు, కళలంటే ఇష్టం. సుహానా.. నటిగా తెరంగేట్రం చేయకుండానే సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. త్వరలో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. సుహానా ఖాన్ జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. 1964లో జరిగిన కథ ఆధారంగా కొందరు కాలేజీ స్నేహితుల కథ ఇది అని తెలుస్తోంది. ఈ సినిమా ప్రముఖ OTT దిగ్గజం NetFlixలో ప్రసారం కానుంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, శ్రీదేవి-బోనీ కపూర్ కూతురు ఖుషీ కపూర్ కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు.
