Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. తీసిన మూడు సినిమాలతోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రూపుదిద్దుకుంటుంది. స్పిరిట్ సినిమాలో సందీప్ రెడ్డి వంగా ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసినట్లు, ఆ పాత్రలో కబీర్ సింగ్ హీరో కనిపించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Waqf Properties: వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఒవైసీకి షాక్
ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రుప్తి దిమ్రిని నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్పెషల్ పాత్రలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించే ఛాన్స్ ఎక్కువగా ఉందని సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది. గతంలో సందీప్ రెడ్డి వంగా – షాహిద్ కపూర్ కాంబో తెరకెక్కిన కబీర్ సింగ్ చిత్రం బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో షాహిద్ నటిస్తున్నారు అనేది అధికారికంగా చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు. ఇక వచ్చే షెడ్యూల్‌లో ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవుతాయని సమాచారం. ఈ సినిమాను టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
READ ALSO: RJ Shekar Basha: టాలీవుడ్ హీరో భార్యపై శేఖర్ బాషా కంప్లైంట్..