Shahrukh Khan Son : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ తన వారసుడిని హీరోగా ఎప్పుడు పరిచయం చేస్తాడని ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ అటు తండ్రికి ఇట్టు షారూఖ్ అభిమానులకు ఆయన కొడుకు ఆర్యన్ షాక్ ఇచ్చాడు. సినిమా హీరోగా కాకుండా డైరెక్టర్ గా మారిపోయాడు. స్టార్ కొడుకు తప్పకుండా స్టార్ అవుతాడని అనుకుంటారు. కానీ ఇలా డైరెక్టర్ గా మారడంతో ఆర్యన్ మనసులో ఏం ఉందోనని షారూఖ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Read Also : Review : ‘సేవ్ ద టైగర్స్’
ఆర్యన్ ఖాన్ ఇటీవల ఒక కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టబోతున్నాడు. డ్యావెల్ ఎక్స్ అనే లగ్జరీ క్లాత్ బ్రాండ్ ని తీసుకురానున్నాడు. దీనికి సంబంధించిన సర్ ప్రైజింగ్ వీడియోతో ఆర్యన్ ఖాన్ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఈ యాడ్ ని ఆర్యన్ ఖాన్ స్వయంగా డైరెక్ట్ చేయగా అందులో షారుఖ్ ఖాన్ నటించాడు. ఎంతైనా కొడుకు డైరెక్షన్లో చేయడం షారుఖ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని టాక్. కొనేళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ లో వెనక పడ్డ షారుఖ్ పఠాన్ హిట్ తో మళ్లీ జోష్ అందుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్యామియో రోల్ చేస్తున్నాడని సమాచారం. షారుఖ్ జవాన్ తో సౌత్ లో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అట్లీ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది.
Read Also : Dasara On OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నాని ‘దసరా’