NTV Telugu Site icon

Shadnagar Murder : షాద్‌నగర్‌ శివలీల హత్య కేసు ఛేదించిన పోలీసులు

Rangareddy Crime

Rangareddy Crime

Shadnagar Murder : షాద్‌నగర్‌ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్‌ దేవదాస్‌ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు చెందిన దేవదాస్, గతంలో లైన్‌మెన్‌గా పనిచేసేవాడు. అయితే, ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ తరువాత కొంతకాలంగా కన్హాలోనే పనిచేస్తున్నాడు.

 
Mountains: భూమి అడుగున మౌంట్ ఎవరెస్ట్ కన్నా రెండు ఎత్తైన పర్వతాలు.. ఎక్కడంటే..!
 

ఈ నేపథ్యంలో శివలీలకు దేవదాస్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నెల 20న శివలీల తన కుటుంబ సభ్యులకు బ్యాంకులో పని ఉందని చెప్పి షాద్‌నగర్‌కు వచ్చింది. అక్కడ దేవదాస్‌తో కలిసి ఉదయం 10 గంటలకు సంగమేశ్వర లాడ్జికి వెళ్లింది.

బుధవారం లాడ్జి గదిలో నుంచి దుర్వాసన రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గదిని పరిశీలించి శివలీల మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన దేవదాస్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. శివలీలను చంపి బంగారు ఆభరణాలతో దేవదాస్‌ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ టీంకు రామ్ చరణ్, ఉపాసన అభినందనలు