Site icon NTV Telugu

WC 2023: ఇండియాలో మనకు ఎవరు సపోర్ట్ ఇవ్వరు..

Shadab Khan

Shadab Khan

వన్డే వరల్డ్‌కప్‌-2023 మెగా ఈవెంట్ కు సమయం దగ్గర పడుతోంది. భారత్‌ వేదికగా అక్టోబరు 5న ఈ మెగా టోర్ని ప్రారంభం కానుంది. ఇక ఐసీసీ టోర్నీలో హాట్‌ ఫేవరెట్‌ మ్యాచ్‌ ఏదైనా ఉంది అంటే అది కేవలం.. టీమిండియా- పాకిస్తాన్‌ల మధ్య పోరు అని చెప్పాలి. అయితే ఈ దాయాదుల పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.

Read Also: Eiffel Tower: ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

దాయాది దేశాల మధ్య అక్టోబరు 14న మ్యాచ్‌ జరిపేందుకు ఐసీసీ రివైజ్‌ షెడ్యూల్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలపై క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇక సొంతగడ్డపై మ్యాచ్‌ జరుగనుండటం టీమిండియాకు అదనపు బలం. కాగా, దీనిపై పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి సపోర్ట్ లభించదు అని అన్నాడు. కాబట్టి పాకిస్తాన్‌ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా తయారు కావాలని చెప్పాడు.

Read Also: Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!

మనం మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. అంత తేలికగా అనుకున్న ఫలితాలు సాధిస్తామని షాదాబ్ ఖాన్ అన్నాడు. టీమిండియాపై విజయం సాధించడంతో పాటు ఇండియాలో వరల్డ్‌కప్‌ గెలిస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకా ఏదీ ఉండదని షాదాబ్ ఖాన్ అన్నాడు. నిజానికి ప్రతి జట్టు టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే, మనకు ఎలాంటి ఆరంభం లభించింది.. ఎలా ముందుకు వెళ్తున్నామనే విషయంపైనే అంతా ఆధారపడి ఉంది.. ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్‌ కూడా కీలకమేనని షాదాబ్‌ కామెంట్స్ చేశాడు.

Read Also: INDvsWI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

కాగా.. రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించిన జట్టులో షాదాబ్‌ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌ కంటే ముందు చిరకాల ప్రత్యర్థి జట్లైన టీమిండియా- పాకిస్తాన్‌ సెప్టెంబరు 2న శ్రీలంక వేదికగా ఆసియా కప్‌ టోర్నీలో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి పాకిస్తాన్‌ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. భారత్ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు.

Exit mobile version