NTV Telugu Site icon

Shabbir Aali: కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదు..

Shabir Ali

Shabir Ali

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా 6 గ్యారెంటీల పేరుతో ప్రచారం చేస్తుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ తో పలు హామీలు ఇచ్చింది. ఇక, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం తాము చేయ‌బోయే ప‌నుల‌ను తెలియజేస్తూ.. మైనార్టీ డిక్లరేషన్ ను తెచ్చింది. ఈ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Read Also: Deputy CM Amjad Basha: చరిత్ర సృష్టించటం జగన్ వల్లే సాధ్యం.. జగన్ అంటే ఒక బ్రాండ్

బీజేపీతో కలిసి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ను ఏర్పాటు చేసిందనీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇక, కేటీఆర్ మైనారిటీ డిక్లరేషన్ పై చేసిన వాఖ్యల షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా NTVతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీ రిజర్వేషన్ల పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడారు.. కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదు అని ఆయన మండిపడ్డారు.

Read Also: Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు

బీఆర్ఎస్- బీజేపీ పార్టీలు ఒక్కటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి.. కాంగ్రెస్ డిక్లరేషన్ పై మాట్లాడాల అంటూ ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు… కొన్ని ఈక్వేషన్ల వల్లే నిజామాబాద్ జిల్లాలో బీసీలకు టికెట్ ఇవ్వలేదు అని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు.