Site icon NTV Telugu

Shabbir Ali : రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

Shabbir Ali

Shabbir Ali

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాక్లెట్ ఇస్తుంది.. కాంగ్రెస్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తోందని వ్యా్‌ఖ్యానించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైనార్టీలకు మేము ఇచ్చిన రిజర్వేషన్‌తో 1500 మంది డాక్టర్ లు అయ్యారన్నారు. 12 శాతం రిసేర్వేషన్ అంటివి..ఏమైంది కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు. దళితుల కంటే కూడా మైనార్టీలు వెనకపడి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఆటే పోయాయని, నోటిఫికేషన్ వేశారు.. కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు.
Also Read : African Swine Flu: మధ్యప్రదేశ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. పందుల చంపివేత

ఫీజు రీయంబర్స్‌ మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు షబ్బీర్ అలీ. ఒరిజినల్ సర్టిఫికెట్‌లు ఇవ్వడానికి ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో ఆందోళన జరుగుతుందని, రైతులు రోజు ధర్నాలు చేస్తున్నా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది ప్రభుత్వ వైఖరి అంటూ ఆయన నిప్పులు చెరిగారు. కామారెడ్డిలో 620 ఎకరాలు ఇండస్ట్రీ జోన్ లో కలిపారని, రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రైతులు రోడ్డు ఎక్కితే..కూడ పట్టించుకోలేదని, కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Real Bahubali: రియల్ బాహుబలి.. 15వేల కిలోల ట్రక్కును పళ్లతో లాగి రికార్డు

Exit mobile version