NTV Telugu Site icon

Shabbir Ali: సీఏఏ వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం లేదు..

Shabbir Ali

Shabbir Ali

Shabbir Ali: వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్‌లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పదేళ్ళుగా వెనకబడిన కులాల వారు తమకు కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు. అమిత్ షా చెప్పిందే చెప్పడం తప్ప చేసేదేమీ లేదని షబ్బీర్‌ అలీ విమర్శించారు. అవినీతి అని ఆరోపిస్తున్న మోడీ, అమిత్ షా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.

Read Also: Kishan Reddy: సికింద్రాబాద్‌లో నీలిట్ సెంటర్.. వర్చువల్ గా ప్రారంభించిన కిషన్ రెడ్డి

సీఏఏ వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయపరంగా ఎదుర్కొందామని ఆయన అన్నారు. కేసీఆర్‌కు డబ్బులు మోసుకపోయే అలవాటు ఉందని.. అందుకే పదే పదే డబ్బు సంచుల గురించి మాట్లాడుతున్నారని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ భాష వల్లే తెలంగాణ బద్నాం అయిందని ఆయన విమర్శించారు. సాటి ప్రజాప్రతినిధులను కేసీఆర్ అసభ్యంగా మాట్లాడినప్పుడు భాష మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.