Shabbir Ali : రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద నుంచి గత నెల 28 నుండి ఈ రోజు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల చివరి వరకు 500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తాం షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 100కు పైగా హామీలను నెరవేర్చకుండా, బుద్ది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించిన ఆయన, గడువులోపు అమలు చేయకపోతే అప్పడు అడగండి అంటూ బీఆరెస్ కు హితవుపలికారు. రాష్ట్రంలో గడీలపాలన అంతమైంది.. ప్రజా పాలన కొనసాగుతున్నదన్నారు. అధికారం కోల్పోయామని దొరలకు నిద్రపట్టడం లేదు.. ఆ ప్రస్టేషన్ లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని బీఆరెస్ ను విమర్శించారు.
Also Read
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
తాజావార్తలు
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
-
Gen-z Viral Video: మేము “జెన్-జీ” ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
-
Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!