NTV Telugu Site icon

Weather Report: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలో వడగాలులు, వానలు

Ap

Ap

Weather Report: ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ నేడు (ఆదివారం) ఒక ప్రకటనలో భాగంగా.. సోమవారం (ఏప్రిల్ 14) రోజున రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు (11) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అలాగే వడగాలు కూడా గురయ్యే జిల్లాల గురించి కూడా ఆయన వివరాలు తెలిపారు. ఇందులో అల్లూరి-5, కాకినాడ- 9, కోనసీమ- 8, తూర్పుగోదావరి- 18, పశ్చిమగోదావరి- 7, ఏలూరు- 8, కృష్ణా- 10, గుంటూరు- 13, బాపట్ల- 9, పల్నాడు 5, ప్రకాశం- 6 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వడగాలులు, పిడుగుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.