AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Rain Alert: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం సుస్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల వ్యవధిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పయనించిన ఈ తీవ్ర వాయుగుండం, ప్రస్తుతం పార్వతీపురానికి 60 కిలోమీటర్లు, ఒడిశాలోని భవానీపట్నకు 90 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం రాత్రికి సాధారణ వాయుగుండంగా మారి, రాబోయే 24 గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉధృతంగా పొంగిపొర్లే వాగులు, వంకలు, కాజ్‌వేలను దాటేందుకు ఎవరూ సాహసించరాదు. వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు ప్రభావిత జిల్లాల్లో మొత్తంగా 8 SDRF, 5 NDRF బృందాలను రంగంలోకి దించారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి 7 గంటల సమయానికి వివిధ ప్రాంతాల్లో నమోదైన ప్రధాన వర్షపాతం వివరాలు కింది విధంగా ఉన్నాయి.
Also Read
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
మన్యం జిల్లా చిలకలపల్లె: 108.2 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం: 103 మి.మీ
మన్యం జిల్లా మక్కువ: 101 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా గాడాల: 99.2 మి.మీ
తాళ్లపూడి: 92 మి.మీ
మన్యం జిల్లా పార్వతీపురం: 87.2 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం: 75.2 మి.మీ
కాకినాడ అర్బన్: 71.5 మి.మీ
జగ్గంపేట: 70.5 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం: 70.5 మి.మీ
విజయనగరం జిల్లా బొబ్బిలి: 69.9 మి.మీ
రాజమహేంద్రవరం అర్బన్: 68 మి.మీ వర్షపాతం నమోదైంది.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
-
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!