Settibathula Rajababu: జనసేనకు గుడ్‌బై.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Settibathula Rajababu: ఏపీలో రాజీనామాలు.. జంపింగ్‌లో కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ పార్టీలో సీటు దక్కలేదని.. మరో పార్టీ గూటికి చేరుతున్నారు నేతలు.. ఇక, ఈ మధ్యే జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు.. ఈ రోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పొత్తుల్లో భాగంగా అమలాపురం అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోయింది.. దీంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజబాబు.. జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు రాజబాబు.. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. కాగా, 2019 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టిబత్తుల రాజబాబు. ఓటమి పాలైన విషయం విదితమే. అయితే, ఈ సారి తనకు టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్న ఆయనకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. ఆయన సీటుకు ఎసరు పెట్టింది. దీంతో, జనసేనకు గుడ్‌బై చెప్పి.. వైసీపీ గూటికి చేరారు శెట్టిబత్తుల రాజబాబు.
Read Also: Janasena Wedding Card: అభిమాని వినూత్న ప్రచారం.. పెళ్లికార్డుపై జనసేన మేనిఫెస్టో..!
Also Read
- మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
- KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
- 165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. జనసేనాని నిర్ణయాలపై ముఖ్య నేతలు మండిపడుతున్నారు. కష్టపడి పని చేస్తున్న తమకు కనీస గుర్తింపు లేదని వాపోతున్నారు. చివరకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల నడుమ పార్టీని వీడుతున్నారట కొందరు నేతలు.. అయితే, అమలాపురం సీటుని ఆశించగా అది టీడీపీకి కేటాయించడంతో ఈ మధ్యే శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా బలంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు మరో షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక, లంచగొండులకు జనసేన టిక్కెట్లు అమ్ముకుని అమలాపురంలో జనసేన జెండా పీకేశారంటూ ఈ మధ్యే శెట్టిబత్తుల రాజాబాబు ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.. అమలాపురం అంటే జనసేన కంచుకోట అని.. అలాంటి కీలకమైన నియోజక వర్గాన్ని టీడీపీకి పొత్తుపేరుతో ధారాదత్తం చేశారని ఆరోపించారు. జనసేన జెండానే ఊపిరిగా.. పార్టీయే ప్రాణంగా బతికిన జనసైనికులకు పవన్ తీరని అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడిన విషయం విదితమే.
తాజావార్తలు
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
-
Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
-
Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!