Site icon NTV Telugu

Settibathula Rajababu: జనసేనకు గుడ్‌బై.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిక

Settibathula Rajababu

Settibathula Rajababu

Settibathula Rajababu: ఏపీలో రాజీనామాలు.. జంపింగ్‌లో కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ పార్టీలో సీటు దక్కలేదని.. మరో పార్టీ గూటికి చేరుతున్నారు నేతలు.. ఇక, ఈ మధ్యే జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్‌ శెట్టిబత్తుల రాజబాబు.. ఈ రోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. పొత్తుల్లో భాగంగా అమలాపురం అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోయింది.. దీంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజబాబు.. జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు రాజబాబు.. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్‌ జగన్‌.. కాగా, 2019 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టిబత్తుల రాజబాబు. ఓటమి పాలైన విషయం విదితమే. అయితే, ఈ సారి తనకు టికెట్‌ దక్కుతుందనే నమ్మకంతో ఉన్న ఆయనకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. ఆయన సీటుకు ఎసరు పెట్టింది. దీంతో, జనసేనకు గుడ్‌బై చెప్పి.. వైసీపీ గూటికి చేరారు శెట్టిబత్తుల రాజబాబు.

Read Also: Janasena Wedding Card: అభిమాని వినూత్న ప్రచారం.. పెళ్లికార్డుపై జనసేన మేనిఫెస్టో..!

కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. జనసేనాని నిర్ణయాలపై ముఖ్య నేతలు మండిపడుతున్నారు. కష్టపడి పని చేస్తున్న తమకు కనీస గుర్తింపు లేదని వాపోతున్నారు. చివరకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల నడుమ పార్టీని వీడుతున్నారట కొందరు నేతలు.. అయితే, అమలాపురం సీటుని ఆశించగా అది టీడీపీకి కేటాయించడంతో ఈ మధ్యే శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా బలంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది. ఇక, లంచగొండులకు జనసేన టిక్కెట్లు అమ్ముకుని అమలాపురంలో జనసేన జెండా పీకేశారంటూ ఈ మధ్యే శెట్టిబత్తుల రాజాబాబు ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.. అమలాపురం అంటే జనసేన కంచుకోట అని.. అలాంటి కీలకమైన నియోజక వర్గాన్ని టీడీపీకి పొత్తుపేరుతో ధారాదత్తం చేశారని ఆరోపించారు. జనసేన జెండానే ఊపిరిగా.. పార్టీయే ప్రాణంగా బతికిన జనసైనికులకు పవన్ తీరని అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడిన విషయం విదితమే.

Exit mobile version