Midhun Reddy: అమరావతిలో మద్యం స్కాం (లిక్కర్ కేసు) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. సిట్ (Special Investigation Team) హైకోర్టులో కీలక కౌంటర్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించాలని కోరుతూ, ఆయనపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. సిట్ తన కౌంటర్‌లో వెల్లడించిన ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి.
Read Also: WTC Final 2025: మొదటి రోజు బౌలర్లదే.. ఒక్కరోజే నేలకూలిన 14 వికెట్లు..!
లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, గతంలో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే తిరస్కరించిందని.. అలాగే దాని అనంతరం దర్యాప్తులో స్పష్టత ఏర్పడిందని పేర్కొన్నారు. వీటితోపాటు మద్యం అక్రమ కార్యకలాపాల్లో వ్యూహ రచన అమలు మిథున్ రెడ్డిదే అని, ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని.. వేర్వేరు మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు రూ.5 కోట్ల మేర నిధులు చేరాయని సిట్ తన కౌంటర్‌లో తెలిపింది.
Read Also: Nikhil : హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం..
వీటిని చూపుతూ మద్యం కేసులో మరింత లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. దర్యాప్తు మరింత ముందుకు సాగించేందుకు ఆయనను కస్టోడియల్ విచారణకు అనుమతించాలని కోరింది. ఇప్పటికే ఒకసారి బెయిల్ నిరాకరించబడిన నేపథ్యంలో, తాజా పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తుందా? లేక విచారణ కోసం అరెస్ట్‌కు మార్గం సుగమమవుతుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
